సర్కారు బడుల్లో సౌకర్యాల కోసం విద్యాంజలి

ABN , First Publish Date - 2022-01-15T06:17:44+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దాతల ద్వారా ప్రభుత్వం సమకూర్చనుంది. అందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన విద్యాంజలి వెబ్‌సైట్‌లో పాఠశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 2021, డిసెంబరు 30న దీని గడువు ముగిసింది.

సర్కారు బడుల్లో సౌకర్యాల కోసం విద్యాంజలి

డిసెంబరు 30తో ముగిసిన నమోదు

గడువు రిజిస్ట్రేషన్‌లో నల్లగొండ వెనుకంజ


నల్లగొండ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దాతల ద్వారా ప్రభుత్వం సమకూర్చనుంది. అందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన విద్యాంజలి వెబ్‌సైట్‌లో పాఠశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 2021, డిసెంబరు 30న దీని గడువు ముగిసింది. కాగా, రిజిస్ట్రేషన్‌ వి షయంలో సూర్యాపేట జిల్లా 75.55శాతంతో ముందుండగా, యాదాద్రి 72.17శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కాగా,55శాతంతో రిజిస్ట్రేషన్‌ విషయంలో నల్లగొండ వెనుకబడింది.


ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోం ది. ప్రభుత్వం కొంత మేర సౌకర్యాలు కల్పిస్తున్నా, పూర్తిస్థాయిలో సమకూరడం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. ఏటా సమస్యలు పెరుగుతున్నా, ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపినా, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావ డం లేదు. ఒకవేళ ఎప్పుడో మంజూరైనా అవి అరకొర మాత్రమే. మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంట గదులు, తరగతి గదులు, ప్రహరీలు, ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకొచ్చి తోడ్పాటు అందిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు సమకూరతాయి.


వస్తు, ఆర్థిక రూపంలో సహకారం

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందించేందుకు ముందుకొచ్చే దాతలకు కేంద్ర ప్రభుత్వం లాగిన్‌ పాస్‌వర్డ్‌ ఇస్తుంది. దాతలు విద్యాంజలి వెబ్‌సైట్‌లో లాగి న్‌ అయి వారికి నచ్చిన పాఠశాలలను ఎంచుకుని సహకారం అందించేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఒప్పందం చేసుకుంటారు. దాతలు వస్తు, ఆర్థిక రూపంలో సహకారం అందించే వెసులుబాటు ఉంది. నల్లగొండ జిల్లాలో మొత్తం 1528 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యాంజలి వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు 55శాతం పాఠశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను డీఈవో బి.భిక్షపతి, సెక్టోరియల్‌ అధికారి వీరయ్య పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 998 పాఠశాలల్లో 754 నమోదు చేసుకున్నాయి. యాదాద్రి జిల్లాలో 744 పాఠశాలలకు 537 రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి.



నల్లగొండ జిల్లాలోని పాఠశాలలు, అవసరమైన మౌలిక వసతులు

మొత్తం         మరమ్మతులు     ప్రహరీలు కావల్సిన         కావల్సిన     కావల్సిన     మరుగుదొడ్ల

పాఠశాలలు చేయాల్సినవి     లేనివి ఫ్యాన్లు ట్యూబ్‌లైట్లు    డెస్క్‌, బెంచీలు    మరమ్మతు     చేయాల్సివని

1483         982             425 4000                 4900             29521        435



యాదాద్రి భువనగిరి జిల్లాలో

మొత్తం         మరుగుదొడ్లు తాగునీరు భవనాలు ప్రహరీలు వంట గదులు శిథిల

పాఠశాలలు కావల్సినవి కావల్సినవి కావల్సినవి కావల్సినవి కావల్సినవి భవనాలు

730         31         11         167         133         11         256


ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పాఠశాలల శాతం

జిల్లా     శాతం

నల్లగొండ     55

యాదాద్రి     72.17

సూర్యాపేట     75.55

Updated Date - 2022-01-15T06:17:44+05:30 IST