షార్ట్‌ ఫిల్మ్స్‌ పోటీలకు విద్యానికేతన్‌ విద్యార్థి

ABN , First Publish Date - 2021-11-27T07:39:22+05:30 IST

ప్రపంచ స్థాయి షార్ట్‌ ఫిలిమ్స్‌ పోటీలలో శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి శ్రీహర్ష తీసిన షార్ట్‌ ఫిలిమ్‌ ఎంపికైంది.

షార్ట్‌ ఫిల్మ్స్‌ పోటీలకు విద్యానికేతన్‌ విద్యార్థి
కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకొంటున్న శ్రీహర్ష

చంద్రగిరి, నవంబరు 26:  ప్రపంచ స్థాయి షార్ట్‌ ఫిలిమ్స్‌ పోటీలలో శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి శ్రీహర్ష తీసిన షార్ట్‌ ఫిలిమ్‌ ఎంపికైంది. అనంతపురం జిల్లా కంబదురుకు చెందిన రవికుమార్‌, భార్గవి దంపతుల కుమారుడు శ్రీహర్ష. చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఇతడికి షార్ట్‌ ఫిలిమ్స్‌ తీయడం అంటే ఇష్టం. తాను తీసిన షార్ట్‌ ఫిలిమ్‌ను ప్రపంచ స్థాయి పోటీలకు పంపాడు. ఈ పోటీలకు 90 దేశాల నుంచి వెయ్యికి పైగా షార్ట్‌ ఫిలిమ్స్‌ రాగా.. అత్యున్నతమైనవిగా 75 ఎంపిక చేశారు. అందులో శ్రీహర్ష తీసిన ఫిలిం ఉంది. ఈనెల 22వ తేద జరిగిన గోవాలో జరిగిన అంతర్జాతీయ షార్ట్‌ ఫిలిమ్స్‌ కాంపిటేషన్‌లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ నుంచి శ్రీహర్ష ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను అందుకున్నాడు. ఇతడిని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎం.మోహన్‌బాబు, సీఈవో మంచు విష్ణు, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు అభినందించారు. 

Updated Date - 2021-11-27T07:39:22+05:30 IST