వారి అనుభవాలు నాకు పనికొచ్చాయి

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

ఏ పాత్ర ఒప్పుకొన్నా అందులో ఒదిగిపోయి నటించడం విద్యాబాలన్‌ ప్రత్యేకత. ఆమె నటించిన ‘షేర్నీ’ చిత్రం ఈ నెల 18న ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఓ మహిళా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కథ ఇది.

వారి అనుభవాలు నాకు పనికొచ్చాయి

ఏ పాత్ర ఒప్పుకొన్నా అందులో ఒదిగిపోయి నటించడం విద్యాబాలన్‌ ప్రత్యేకత. ఆమె నటించిన ‘షేర్నీ’ చిత్రం ఈ నెల 18న ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఓ మహిళా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కథ ఇది. అసాధారణమైన వృత్తి కావడంతో ఆమె పెళ్లికి కూడా అడ్డంకులు ఏర్పడతాయి. విద్యాబాలన్‌ సినిమా కావడంతో విడుదలకు ముందే అంచనాలు పెరిగాయి. ఆమె అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కొత్త తరహా పాత్ర కావడంతో ఒకరిద్దరు మహిళా ఫారెస్ట్‌ ఆఫీసర్లను కలసుకొని, వారి అనుభవాలు అడిగి తెలుసుకున్నట్లు విద్యాబాలన్‌ చెప్పారు. పాత్ర పరంగా సిద్ధమవడం కోసం వారి దగ్గర కొంత శిక్షణ కూడా తీసుకున్నానని ఆమె తెలిపారు. 


‘ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫిజికల్‌గా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అడుగడుగునా రిస్క్‌ ఉంటుంది. అందుకే మహిళలు సాదారణంగా ఇలాంటి ఉద్యోగాల జోలికి పోరు. నేను కలుసుకొన్న మహిళా ఫారెస్ట్‌ ఆఫీసర్లు తమ అనుభవాలు చెబుతుంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ‘షేర్నీ’ చిత్రంలో నేను విద్యా విన్సెంట్‌ అనే పాత్ర పోషించాను. మహిళా ఫారెస్ట్‌ ఆఫీసర్లు చెప్పిన అనుభవాలు ఈ పాత్రను చక్కగా పోషించడానికి నాకు పనికొచ్చాయి’ అని చెప్పారు విద్యాబాలన్‌.

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST