విధుల్లో చేర్చుకోవాలి

ABN , First Publish Date - 2021-10-26T05:02:15+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలగించిన తమను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని విద్యా వలంటీర్లు డిమాండ్‌ చేశారు.

విధుల్లో చేర్చుకోవాలి
డీఈవో కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న విద్యా వలంటీర్లు

- విద్యావలంటీర్ల డిమాండ్‌

- డీఈవో కార్యాలయం ముందు ధర్నా

    గద్వాల టౌన్‌, అక్టోబరు 25 : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలగించిన తమను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని విద్యా వలంటీర్లు డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ పెండింగ్‌ వేతనాలు అందక అవస్థలు పడుతున్న తమను, విధుల్లోకి తీసుకుని ఆదుకో వాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోక పోవడంపై అసహసం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సోమవారం పట్టణంలోని డీఈవో కార్యా లయం ముందు దాదాపు రెండుగంటల పాటు ఆందోళన చేశారు. డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్ట రేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యాభ్యాసం చేసిన తాము, ఉద్యోగ అవకాశాలు లేక కూలీ పనులు చేసే పరిస్థితి తలె త్తిందన్నారు. వేతనాలు అందక కుటుంబ పోషణ భారమై రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను విధుల్లోకి చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో రఘు, వినయ్‌, నాగేష్‌, రంగస్వామి, వెంకటేష్‌, శివ గౌడ్‌, వెంకటలక్ష్మి, బద్రేష్‌, పద్మ, రాణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:02:15+05:30 IST