Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్షర కేంద్రాలకు విద్యాసామగ్రి అందజేత

 మనుబోలు, నవంబరు 27: కలెక్టర్‌ ఆదేశాల మేరకు అక్షర కేంద్రాలకు విద్యాసామగ్రి కిట్టు అందిస్తున్నామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీపీ గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా కార్యదర్శులకు విద్యాసామగ్రి కిట్టును అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ 14 సచివాలయా ల పరిధిలో 188 అక్షర కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. వీటిలో 3679మంది చదువు నేర్చుకుంటున్నారన్నారు. వీరికి  నోటు పుసక్తం, పెన్ను, రబ్బరు, పెన్సిల్‌, షాపనర్‌లు ఇచ్చా మన్నారు. కార్యదర్శులు వీటిని వయోజనులకు అందేలా చేయాలన్నారు. కేంద్రాల నిర్వహణపై కార్యదర్శులు దృష్టి పెట్టాలన్నారు.


Advertisement
Advertisement