వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ నటిగా తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విద్యాబాలన్ నటించిన చిత్రం ‘షేర్నీ’. బుధవారం అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామస్థులను పులి చంపేస్తుంటుంది. ఆ పులిని పట్టుకోవడానికి విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా వస్తుంది. ఆమెకుఎదురయ్యే అనుభవాలేంటి? ఎదుర్కొన్న సమస్యలేంటి? వాటిని ఆమె ఎలా అధిగమించింది? అనేదే షేర్నీ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అమిత్ మసూర్కర్ దర్శకత్వం వహించారు. జూన్ 18న అమెజాన్ ప్రైమ్‌లో సినిమా విడుదలవుతుంది.