Jun 14 2021 @ 23:55PM

వంటింటికి పరిమితం కాదు: విద్యాబాలన్‌

మహిళలకు సంబంధించిన ఏ సమస్య కోసమైనా గొంతెత్తి మాట్లాడతారు విద్యాబాలన్‌.  అందుకే ఆమెను నారీ శక్తి అంటారు. ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగ వివక్ష గురించి మాట్లాడారు. ‘‘స్ర్తీ, పురుషులిద్దరూ సమానమని నేను బలంగా నమ్ముతాను. వంటను ఆడవాళ్లే చేయాలనే రూల్‌ ఏమైనా ఉందా? మహిళలు అంటే వంట గదికే పరిమిత అయ్యేవాళ్లు కాదు. మా ఇంటికి అతిథులు వచ్చిన సమయంలో ఒకరు ‘నీకు వంట రాదు కదా’ అని కామెంట్‌ చేశారు. ‘నాకే కాదు మా ఆయన సిద్థార్థ్‌ కూడా రాదు’ అని చెప్పాను. ‘లేదు నువ్వు నేర్చుకుంటేనే బాగుంటుంది’ అని ఆ వ్యక్తి మళ్లీ సలహా ఇచ్చారు. ‘సిద్థార్థ్‌కు నాకూ మధ్య తేడా ఉండాలి’’ అని సమాధానం ఇచ్చేసరికి ఆయన నోరు మెదపలేదు. చిన్నప్పటి నుంచీ నేను ఇంతే. మా అమ్మ వంట నేర్చుకోమని గోల పెట్టేది. ‘అవసరమైతే వంటమనిషిని పెట్టుకుంటా. లేదంటే వంట వచ్చినవాణ్ని పెళ్లి చేసుకుంటే సరి! పదేపదే చెప్పడం అవసరమా’ అని అమ్మతో ఎదురు వాదించేదాన్ని’’ అని విద్యాబాలన్‌ చెప్పారు. 


Bollywoodమరిన్ని...