ఒప్పంద పత్రాలను స్వీకరిస్తున్న ప్రిన్సిపాల్ రత్నప్రసాద్, డీన్ పాండురంగారావు
పెనమలూరు, జనవరి 21 : విద్య, పరిశోధన సహకారం కోసం వీఆర్ సిద్ధార్థ, ఎన్‌ఐటీ వరంగల్ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ సంద ర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ రత్న ప్రసాద్ మాట్లాడుతూ పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో అకడమిక్, రీసెర్చ్ సహకారాలు, ఫ్యాకల్టీ ఫెలోషిప్‌లు, ఎన్‌ఐటీడ బ్ల్యూలో విద్యార్థుల సమ్మర్ ఇంటర్‌షిప్‌లను కవర్ చేయడానికి ఒప్పదం కుదుర్చు కున్నట్లు తెలిపారు. మేధో సంపత్తి హక్కులు ఎంవోయూ ప్రకారం రెండు సంస్థలకు చెందుతుం దన్నారు. ఎన్‌ఐటీ, వీఆర్ సిద్ధార్థ అధ్యాపకులు, విద్యార్ధుల కోసం సందర్శనలు, అతిథి ఉపన్యాసాలు, శిక్షణా కార్యక్ర మాలను ఏర్పాటు చేయడం ద్వారా రెండు సంస్థలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వర్క్ షాప్‌లు, కాన్ఫరెన్స్‌లు, సెమినార్‌లను నిర్వహించడం ద్వారా అకడమిక్ కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ఎన్.వి.రమణరావు, సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు సిహెచ్ నాగేశ్వరరావు, కార్యదర్శి పి. లక్ష్మణరావు, కన్వీనర్ ఎం. రాజయ్య, డీన్ బి. పాండు రంగారావు పాల్గొన్నారు.