విధానసౌధలో ప్రవేశం నిషేధం

ABN , First Publish Date - 2022-01-06T18:07:36+05:30 IST

కొవిడ్‌ మూడో విడత ప్రబలుతున్న తరుణంలో శక్తికేంద్రం విధానసౌధ, వికాససౌధ ప్రవేశంపై నిషేధం విధించారు. బుధవారం నుంచే నిబంధనలు అమలులోకి వచ్చాయి. విధానసౌధ, వికాససౌధతో పాటు ఎంఎస్‌

విధానసౌధలో ప్రవేశం నిషేధం

                    - అధికారులు, ఉద్యోగులకు మాత్రమే అనుమతి


బెంగళూరు: కొవిడ్‌ మూడో విడత ప్రబలుతున్న తరుణంలో శక్తికేంద్రం విధానసౌధ, వికాససౌధ ప్రవేశంపై నిషేధం విధించారు. బుధవారం నుంచే నిబంధనలు అమలులోకి వచ్చాయి. విధానసౌధ, వికాససౌధతో పాటు ఎంఎస్‌ బిల్డింగ్‌లోను ప్రవేశాలను రద్దు చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రవికుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో పాటు ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ పెరుగుతున్న మేరకు ప్రజలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయాలకు తప్పనిసరిగా రాదలచుకున్నవారు ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు, సిబ్బంది ఎవరైనా రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ చూపాల్సి ఉంటుంది. ఇక విధానసౌధతో పాటు అన్ని కార్యాలయాల అధికారులు, ఉద్యోగుల రెండు డోసుల వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌తో హాజరు కావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వేతన రహిత సెలవులుగా పరిగణించేలా ఉత్తర్వులలో పేర్కొన్నారు. విధానసౌధలోకి ప్రవేశించడం మరో రెండువారాల పాటు కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-01-06T18:07:36+05:30 IST