హైవేపై ట్రక్, కారు ఢీ.. దారుణ దృశ్యం.. వైరల్ వీడియో..!

ABN , First Publish Date - 2022-04-15T03:11:12+05:30 IST

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైవేపై ట్రక్, కారు ఢీ.. దారుణ దృశ్యం.. వైరల్ వీడియో..!

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిన్నెసొటా రాష్ట్రంలోని బ్లెయిన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. హైవేపైకి వేగంగా వస్తూ అకస్మాత్తుగా అదుపుకోల్పోయిన ఓ కారు రహదారిపై వెళుతున్న మరో ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రక్‌ కూడా అదుపుతప్పి వంతెనపై ఉన్న రెయిలింగ్ ఢీకొట్టింది. ఫలితంగా ట్రక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే.. ట్రక్ డ్రైవర్ చాకచక్యంగా మంటల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడగలిగాడు. 



Updated Date - 2022-04-15T03:11:12+05:30 IST