ఫేస్‌బుక్‌లో వీడియో ప్రొఫైల్‌

ABN , First Publish Date - 2021-07-31T06:08:11+05:30 IST

ఫొటో, టెక్స్ట్‌ నుంచి ప్రపంచం వేగంగా ముందుకు కదులుతోంది. వీడియో ప్రొఫైల్‌ దిశగా పరుగులు పెడుతోంది. ఫేస్‌బుక్‌ వినియోగదారులు వీడియో ప్రోఫైల్‌ అనుభవం పొందనున్నారు.

ఫేస్‌బుక్‌లో వీడియో ప్రొఫైల్‌

ఫొటో, టెక్స్ట్‌ నుంచి ప్రపంచం వేగంగా ముందుకు కదులుతోంది. వీడియో ప్రొఫైల్‌ దిశగా పరుగులు పెడుతోంది. ఫేస్‌బుక్‌ వినియోగదారులు వీడియో ప్రోఫైల్‌ అనుభవం పొందనున్నారు. స్నేహితులు, ఒకే ఆలోచన ఉన్న వ్యక్తులు, సమూహాలతో కాంటాక్ట్‌ అవడంతో మొదలుపెట్టి సమాచారాన్ని వివిధ రూపాల్లో పంచుకోవడం వరకు ఫేస్‌బుక్‌ అవతారాలు తెలిసినవే. వీటికి తాజా ఫేస్‌బుక్‌ వీడియో ప్రొఫైల్‌  చేర్చనున్నారు. 


యూజర్లు ఏడు సెకన్ల వీడియోను తమ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్‌లతో మాత్రమే ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్‌లోడింగ్‌ విధానంలో ప్రతి దశను ముందు తెలుసుకోవాలి. స్టెప్‌ బై స్టెప్‌ గైడ్‌ ఇలా....


ఐఫోన్‌ నుంచి ఇలా....

ఐఫోన్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ను మొదట ఓపెన్‌ చేసుకోవాలి. 

యాప్‌ టాప్‌ రైట్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ను క్లిక్‌ చేయాలి. 

ప్రొఫైల్‌ పిక్చర్‌ను టాప్‌ చేయాలి. 

న్యూ ప్రొఫైల్‌ వీడియోను టాప్‌ చేసి అప్పటికప్పుడు కొత్త ప్రొఫైల్‌ వీడియోను తీసి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా ప్రొఫైల్‌ పిక్చర్‌ను టాప్‌ సెలెక్ట్‌ చేయాలి. లేదంటే ఫోన్‌ గాలరీలో ఉన్న వీడియోను కూడా సెలెక్ట్‌ చేసుకోవచ్చు.  

ఎడిట్‌ను టాప్‌ చేసి వీడియోను ఎడిట్‌ చేసుకోవాలి. 

ట్రిమ్‌ను టాప్‌ చేసి వీడియో నిడివిని తగ్గించుకోవాలి. సౌండ్‌ను టాప్‌ చేసి అది ఆన్‌లో ఉందా, ఆఫ్‌లో ఉందా లేదా కవర్‌ చేసేందుకు మీ వీడియో కోసం థంబ్‌ నెయిల్‌ను ఎంపిక చేసుకోవాలి.

టాప్‌ డన్‌, టాప్‌ సేవ్‌తో పని ముగుస్తుంది. 


ఆండ్రాయిడ్‌ స్మార్‌ ఫోన్‌లో....

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేయాలి. 

మీ న్యూస్‌ ఫీడ్‌ నుంచి యాప్‌ లెఫ్ట్‌ కార్నర్‌ టాప్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ను టాప్‌ చేసుకోవాలి. 

ప్రొఫైల్‌ పిక్చర్‌ లేదంటే వీడియోను టాప్‌  చేయాలి. 

కొత్త వీడియో కోసం న్యూ ప్రొఫైల్‌ వీడియోను టాప్‌ చేయాలి. లేదా ఫోన్‌లో ఉన్న వీడియోను ఎంపిక చేసుకునేందుకు ప్రొఫైల్‌ వీడియో టాప్‌ సెలెక్ట్‌ చేయాలి. 

వీడియోను ఎడిట్‌ చేసేందుకు ఎడిట్‌ను టాప్‌ చేయాలి. 

చివరగా ట్రిమ్‌, క్రాప్‌ కోసం ఐఫోన్‌లో మాదిరిగానే చేయాలి. 

పది మందిలో ఒకరిగా కాకుండా మీ ప్రత్యేకతను నలుగురిలో చూపించుకోవాలంటే ఇలాంటి వీడియో ప్రొఫైల్స్‌ తప్పనిసరి.

Updated Date - 2021-07-31T06:08:11+05:30 IST