Viral Video: రేపే పండగని.. అతడి ఒళ్లో తలపెట్టుకుని వలవలా ఏడ్చిన పక్షి!

ABN , First Publish Date - 2021-12-01T01:33:11+05:30 IST

ఆ పండగ రేపే తెలిసి ఓ టర్కీ కోడి వెక్కివెక్కి ఏడ్చిందట. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: రేపే పండగని.. అతడి ఒళ్లో తలపెట్టుకుని వలవలా ఏడ్చిన పక్షి!

ఇంటర్నెట్ డెస్క్: థ్యాంక్స్ గివింగ్ డే .. మనకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకునే రోజు. పాశ్చాత్య దేశాల్లో ఈ రోజున ప్రజలు వేడుక చేసుకుంటారు. తమక సహాయం చేసిన వారికి ధన్యవాదాలు చెబుతూ బంధువులు, స్నేహితులతో కలిసి విందులు ఏర్పాటు చేసుకుంటారు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది! అంతవరకూ ఓకే కానీ.. మరుసటి రోజు థ్యాంక్స్ గివింగ్ అనగా.. ఓ టర్కీ కోడి వెక్కివెక్కి ఏడ్చిందట. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్  మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఒళ్లో పక్షి తలపెట్టుకుని ఏడుస్తున్న వీడియోను జంతు హక్కుల కార్యకర్త జాన్ ఓబర్గ్ ట్విటర్‌లో షేర్ చేశారు. థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా రేపు టర్కీ కోడిని వండుకుని తినాలనుకుంటున్న వారందరూ ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఆ తరువాత.. టర్కీని భోం చేసే ఆలోచన విరమిస్తారు’. థ్యాంక్స్ గివింగ్ వేడుకల్లో టర్కీని కోడిని తినడం సంప్రదాయం. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 


అయితే..తను షేర్ చేసిన వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరూ, ఇది ఎక్కడిదీ అన్న వివరాలేవీ జాన్ పేర్కొనలేదు. అయితే.. వీడియోను చూసిన వారెవరికైనా అతడి ఓదార్పుతో  పక్షి స్వాంతన పొందుతున్నట్టు అనిపించకమానదు. దీంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. కొందరు మాంసాహారం తీసుకోవడం తప్పేం లేదని గట్టిగా వాదిస్తే మరి కొందరు మాత్రం శాఖాహారానికే ఓటు వేశారు. ‘‘ఈ వీడియోను చూస్తే నాకూ కన్నీళ్లు ఆగలేదు’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.



Updated Date - 2021-12-01T01:33:11+05:30 IST