అరె! ఏంటిది.. సముద్రంలోని బోటును వెంబడిస్తోంది. ఇలాంటి జంతువును ఎప్పుడూ చూడలేదే..

ABN , First Publish Date - 2022-02-14T03:11:30+05:30 IST

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో విచిత్రమైన జంతువును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మెరిసే కళ్లతో ఉన్న ఆ జంతువు రాత్రి సమయంలో ఓ బోటును వెంబడిస్తుంది..

అరె! ఏంటిది.. సముద్రంలోని బోటును వెంబడిస్తోంది. ఇలాంటి జంతువును ఎప్పుడూ చూడలేదే..

సముద్రంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. మనకి తెలీని ఎన్నో జీవరాశులు సంచరిస్తూ ఉంటాయి. మత్స్యకారులకు అప్పుడప్పుడూ కొన్ని తారసపడడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో  విచిత్రమైన జంతువును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మెరిసే కళ్లతో ఉన్న ఆ జంతువు రాత్రి సమయంలో ఓ బోటును వెంబడిస్తుంది. వేగంగా వెళ్తున్న బోటును అంతే వేగంగా వెంబడించడం వీడియోలో చూడొచ్చు.


దక్షిణ బ్రెజిల్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సముంద్రంలో స్పీడ్ బోటుపై చేపల వేటకు వెళ్తాడు. చేపలు పట్టే క్రమంలో అతడికి మెరిసే కళ్లతో ఓ వింత జీవి కనిపిస్తుంది. దాన్ని చూసి భయంతో చేపల వేటను పక్కనపెట్టి.. బోటుతో తిరుగు ప్రయాణమవుతాడు. అప్పటికే భయంతో ఉన్న ఆ వ్యక్తి.. బోటును అత్యంత వేగంగా నడుపుతాడు. అయితే ఆ వింత జీవి మాత్రం అతన్ని వదలదు. వేగంగా వెళ్తున్న బోటును అంతే వేగంగా వెంటాడుతుంది. చేప తరహాలో నీటిలో డైవ్ చేస్తూ బోటును వెంబడించడం వీడియోలో చూడొచ్చు. బోటు సమీపానికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో ఇదేం వింత జీవిరా నాయనా.. ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

విమానం గాలిలో ఉండగా.. లోపలికి ఇదెలా వచ్చింది.. ‘అమ్మ బాబోయ్!’ అంటూ అవాక్కయిన ప్రయాణికులు





Updated Date - 2022-02-14T03:11:30+05:30 IST