Abn logo
Sep 22 2021 @ 04:00AM

సింధుతో కలిసి కేలరీలు కరిగిస్తూ..

న్యూఢిల్లీ: ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు.. బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పడుకోన్‌తో మంచి దోస్తీ కుదిరినట్టుంది. వీరిద్దరూ తరచూ కలుస్తూ సరదాగా గడుపుతున్నారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో దీపిక పోస్టు చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. అందులో దీపిక షటిల్‌ ఆడుతూ కేలరీలు కరిగిస్తోంది. ఆటలో ఆమె పార్ట్‌నర్‌ మరెవరో కాదు సింధు. ఈ సందర్భంగా తాము ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోతోపాటు కొన్ని ఫొటోలను కూడా పంచుకున్న దీపిక.. ‘నా జీవితంలో ప్రతి రోజూ లాంటిదే.. సింధుతో కలసి కేలరీలు కరిగిస్తున్నాన’ని రాసింది.

సింధు కూడా ఎంతో సరదాగా ఆడుతూ కనిపించింది. కొన్ని రోజుల క్రితం ‘బ్యాడ్మింటన్‌ ఆడిన తర్వాత నా మెరుపు’ అని ఓ సెల్ఫీని దీపిక పోస్టు చేసింది. దీనికి సింధు ‘ఎన్ని కేలరీల తర్వాత?’ అని అడిగింది. ప్రతిగా ‘కేలరీల గురించి మరిచిపో..! వళ్లంతా నొప్పులు’ అని పడుకోన్‌ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న దీపిక కూడా ఒకప్పుడు జాతీయస్థాయి షట్లర్‌. అందునా భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాష్‌ పడుకోన్‌ కుమార్తె కూడా. 

క్రైమ్ మరిన్ని...