Viral Video: వామ్మో.. ఇవేం రోడ్లు.. ఉత్త చేతుల్తోనే ఎలా తీస్తున్నారో చూడండి..!

ABN , First Publish Date - 2022-07-26T02:40:09+05:30 IST

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రహదారులు ఘోరంగా తయారయ్యాయి.

Viral Video: వామ్మో.. ఇవేం రోడ్లు.. ఉత్త చేతుల్తోనే ఎలా తీస్తున్నారో చూడండి..!

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రహదారులు ఘోరంగా తయారయ్యాయి. నాసిరకంగా వేసిన రోడ్లు (Roads) ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్నాయి. తాజాగా వైరల్ (Viral Video) అవుతున్న ఓ వీడియోలో రోడ్డు పరిస్థితి చూస్తే కాంట్రాక్టర్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సాధారణంగా భారీ వాహనాలు వెళ్లినపుడు, సుదీర్ఘ కాలంగా మరమ్మత్తులు చేయనపుడు రోడ్లు పాడవుతుంటాయి. 


కర్ణాటక (Karnataka)లోని ఓ ప్రాంతంలో వేసిన రోడ్లు చేతులతో తీస్తేనే వచ్చేస్తున్నాయి. ఆ వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఉత్త చేతులతోనే రోడ్డును తీసేస్తున్నారు. ఈ వీడియోను krishanKTRS ట్విటర్‌లో షేర్ చేశారు.`కర్ణాకటలోని డబుల్ ఇంజిన్ వ్యక్తులు చాలా బలవంతుల`ని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

 

Updated Date - 2022-07-26T02:40:09+05:30 IST