ఏనుగు వీడియో వైరల్: మరోదారిలేక, నిస్సహాయస్థితిలో ఇలా..

ABN , First Publish Date - 2020-02-18T21:36:34+05:30 IST

ఓ ఏనుగు చేసిన పనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగు వీడియో వైరల్: మరోదారిలేక, నిస్సహాయస్థితిలో ఇలా..

న్యూఢిల్లీ: రానురానూ పెరిగిపోతున్న జనాభా ప్రకృతిపై భారం పెంచుతోంది. అడవులు విస్తీర్ణం తరిగిపోతుండటంతో ఈ వనాలపై ఆధారపడిన జీవ రాసులు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. అడువుల్లోంచి రోడ్లు రైల్వేట్రాక్‌లు నిర్మిస్తుండటంతో వాటిని ఎలా దాటాలో తెలియక అనేక జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో మరి కొన్ని జంతువులు వాటికి అలవాటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఏనుగు చేసిన పనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ట్వీట్ చేసిన వీడియో ఇది. ఓ ఏనుగు రోడ్డు దాటే క్రమంలో సన్నగా ఉన్న మెట్లదారిలో నేర్పు వెళుతుంది. చాలా జాగ్రత్తా మెట్లు ఎక్కుతుంది. ఆ తరువాత అటుగావైపు వెళతున్న వాహనాన్ని చూస్తుంది. దీనిపై స్పందించిని కాస్వాన్.. ఆ ఒక్క చూపే అంతా చెప్పేస్తోంది అని కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ‘ఏనుగు పడిపోతుందేమోనని భయపడ్డాను. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు. మానుషులు సృష్టించిన అడ్డంకులను తన తెలివితేటలతో సునాయసంగా అధికమించింది. అయితే అసలు జంతువులు ఇటువంటి ఇబ్బందలు ఎదుర్కోకుండా చూడాల్సిన బాధ్యత మనమీద ఉంది’ అని అనేక మంది అభిప్రాయపడ్డారు.  

                             వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

      

Updated Date - 2020-02-18T21:36:34+05:30 IST