Viral Video: చిరుత ఎంత వేగంగా పరిగెట్టగలదో ఎప్పుడైనా చూశారా? షాకవుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-07-01T22:37:53+05:30 IST

ఎవరైనా వేగంగా పరిగెడితే వారిని చిరుత పులితో పోలుస్తారు. వేగానికి చిరుత పర్యాయపదంగా మారిపోయింది

Viral Video: చిరుత ఎంత వేగంగా పరిగెట్టగలదో ఎప్పుడైనా చూశారా? షాకవుతున్న నెటిజన్లు

ఎవరైనా వేగంగా పరిగెడితే వారిని చిరుత పులితో పోలుస్తారు. వేగానికి చిరుత పర్యాయపదంగా మారిపోయింది. చిరుత వేగంగా పరిగెడుతుందని వినడమే కానీ, ఎప్పుడూ చూసి ఉండరు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిరుత వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిరుత కేవలం 16 అడుగుల్లో 100 మీటర్ల దూరాన్ని కవర్ చేసింది. దాని ఒక జంప్ 7 మీటర్ల వరకు ఉంది. 



@wonderofscience అనే ట్విటర్‌ అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో చిరుత అత్యంత వేగంగా పరిగెడుతోంది. చిరుత ఒక జంప్‌లో 23 అడుగుల దూరాన్ని కవర్ చేసిందని వీడియోలో చెప్పారు. ఈ వీడియోను జూన్ 29న షేర్ చేయగా ఇప్పటికి 45 లక్షల వ్యూస్ వచ్చాయి. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. 

Updated Date - 2022-07-01T22:37:53+05:30 IST