తల్లి ప్రేమకు సాటి మరేదీ ఉండదు. తాను పస్తులు ఉన్నా.. పిల్లలు ఖాళీ కడుపుతో పడుకుంటే అమ్మ తట్టుకోలేదు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తన పిల్ల జోలికి వచ్చిన సింహాల గుంపునకు గేదె చుక్కలు చూపించింది. పిల్లను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ గేదెను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఓ అడవిలోని విశాల ప్రదేశంలో ఓ గేదె తన పిల్లతో కలిసి సేద తీరుతూ ఉంటుంది. అదే సమయంలో కొన్ని సింహాలు వాటిని గమనించి, వేటాడేందుకు దగ్గరికి వెళ్తాయి. పిల్ల గేదెపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. వెంటనే అప్రమత్తమైన తల్లి గేదె ఆ సింహాలపైకి ఎదరుదాడి చేస్తుంది. పదునైన కొమ్ములతో సింహాలను తిప్పి తిప్పి కొడుతుంది. దాని ధాటికి దగ్గరికి వెళ్లేందుకు కూడా సింహాలు భయపడతాయి. సింహాలు దాడి చేయాలని ఎంత ప్రయత్నించినా.. గేదె మాత్రం వెనక్కు తగ్గకుండా పోరాడుతుంది. ఇంతలో మరికొన్ని గేదెలు అక్కడికి వస్తాయి. అన్నీ కలిసి సింహాలను తరిమికొడతాయి. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు గేదె ధైర్యానికి సెల్యూట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి