Viral video: ఆమె రాక్‌స్టార్.. పెళ్లిలో వధువు సూపర్ డ్యాన్స్‌కు నెటిజన్ల ఫిదా!

ABN , First Publish Date - 2022-02-25T20:26:38+05:30 IST

కొన్ని సంవత్సరాలుగా పెళ్లి వేడుకలు జరిగే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. పెళ్లి పీటల మీద వరుడి పక్కన సిగ్గుపడుతూ వధువు కూర్చునే రోజులు పోయాయి.

Viral video: ఆమె రాక్‌స్టార్.. పెళ్లిలో వధువు సూపర్ డ్యాన్స్‌కు నెటిజన్ల ఫిదా!

కొన్ని సంవత్సరాలుగా పెళ్లి వేడుకలు జరిగే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. పెళ్లి పీటల మీద వరుడి పక్కన సిగ్గుపడుతూ వధువు కూర్చునే రోజులు పోయాయి. కొత్త జీవితంలోకి అడుగు పెట్టే క్షణాలను మధుర జ్ఞాపకంగా తీర్చి దిద్దుకోవాలని వధూవరులు అనుకుంటున్నారు. పెళ్లిలో బంధుమిత్రులతో కలిసి వధూవురులు సంగీత్ పేరిట డ్యాన్స్‌లు చేస్తున్నారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో వధువు అదిరిపోయే రీతిలో భాంగ్రా డ్యాన్స్ చేసింది. గోల్డ్ లెహంగాలో మెరిసిపోయిన వధువు ఆయుషీ అదిరిపోయే స్టెప్పులతో అలరించింది. మ్యూజిక్‌కి తగినట్టు మైమరిచిపోయి చిందులేసింది. ఆ తర్వాత వధువుపై వరుడు కరెన్సీ నోట్లు విసిరాడు. ఆ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో 25 లక్షల వ్యూస్ దక్కించుకుంది. 1.68 లక్షల మంది లైక్ చేశారు. `ఆమె వధువు కాదు.. రాక్‌స్టార్` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2022-02-25T20:26:38+05:30 IST