Viral Video: గుండెలను పిండేస్తున్న ఘటన.. ప్రాణాలు దక్కుతాయన్న ఆశను పెంచి మరుక్షణంలోనే..

ABN , First Publish Date - 2022-04-12T16:15:07+05:30 IST

ప్రాణాలు దక్కాయని అనుకునే క్షణంలో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటే.. ఆ ఊహే భరించలేని విధంగా ఉంటుంది కదా. అయితే జార్ఖండ్‌లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది....

Viral Video: గుండెలను పిండేస్తున్న ఘటన.. ప్రాణాలు దక్కుతాయన్న ఆశను పెంచి మరుక్షణంలోనే..

ప్రాణాలు దక్కాయని అనుకునే క్షణంలో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటే.. ఆ ఊహే భరించలేని విధంగా ఉంటుంది కదా. అయితే జార్ఖండ్‌లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. అనూహ్య ప్రమాదంలో చిక్కుకున్న కొందరు.. తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే రెస్క్యూ బృందం వారిని కాపాడేందుకు రావడంతో ఆశలు చిగురించాయి. ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే..


జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని ధార్మిక క్షేత్రం దేవఘర్‌లోని త్రికూట్ పర్వతంపై నిర్మించిన రోప్‌వే వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి రోప్‌వే ఏర్పాటు చేశారు. సోమవారం చాలా మంది పర్యాటకులు కేబుల్ కార్లలో ప్రయాణిస్తుండగా బైద్యనాథ్ ధామ్ నుంచి 20 కి.మీ దూరంలో ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో వెనక ఉన్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సుమారు 12మంది గాయపడ్డారు. దాదాపు 1500 అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 30మందిని . రెస్క్యూ బృందం.. హెలీకాప్టర్ల ద్వారా రక్షించింది.

డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..


అయితే వారిని రక్షించే క్రమంలో అనుకోని ప్రమాదం జరిగింది. రోప్‌వే చిక్కుకున్న  ఓ వ్యక్తిని రక్షించేందుకు హెలీకాప్లర్ ద్వారా తాడు వదిలారు. దాని పట్టుకుని  హెలీకాప్లర్‌లోకి ఎక్కే క్రమంలో పట్టుతప్పి పైనుంచి కింద లోయలోకి పడి మృతి చెందాడు. అంతా చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భార్య, ఐదేళ్ల కూతురు.. ఎదురుగా రెండు కంటైనర్లు.. ఆ తండ్రి చేసిన పనికి నెటిజన్లు ఫిదా..





Updated Date - 2022-04-12T16:15:07+05:30 IST