Viral Video: గుర్రం పైనుంచి ఈ యువకుడు వేసే నాగిని డ్యాన్స్.. ఒక్కసారైనా చూసి తీరాల్సిందే..

ABN , First Publish Date - 2022-01-31T03:05:08+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. పెళ్లి ఊరేగింపు సందడి సందడిగా జరుగుతూ ఉంటుంది. వరుడు గుర్రంపై మండపానికి వెళ్లడం వీడియోలో చూడొచ్చు. అయితే వరుడి గుర్రంపై ముందు...

Viral Video: గుర్రం పైనుంచి ఈ యువకుడు వేసే నాగిని డ్యాన్స్.. ఒక్కసారైనా చూసి తీరాల్సిందే..

పెళ్లిళ్ల ఊరేగింపుల్లో యువకుల సందడి ఎలాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో వింత వింత ఫీట్స్ చేస్తుంటారు. ప్రస్తుతం ఎలాగూ సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలా వీడియో తీసి, అలా పోస్టు చేస్తున్నారు. అందులో ఏమాత్రం కొత్తదనం ఉన్నా.. ఆ వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. కొందరైతే కేవలం వీడియోల కోసమే సర్కస్ ఫీట్లు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోన్న సదరు వీడియోలోని వింత... ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. పెళ్లి ఊరేగింపు సందడిగా సాగుతోంది. వరుడు గుర్రంపై మండపానికి వెళ్లడం వీడియోలో చూడొచ్చు. అయితే వరుడి గుర్రంపై ముందు వైపు మరో యువకుడు కూర్చుని నాగిని డ్యాన్స్ చేస్తుంటాడు. నడుమును పూర్తిగా వంచి అతడు వేసే స్టెప్పు అందరినీ ఆకట్టుకుంటోంది. నడుమును స్ప్రింగ్‌లా తిప్పుతూ వేసే స్టెప్పు అనితరసాధ్యం అనిపించేలా ఉంటుంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

ఈ యువకుడికి అదృష్టం టన్నుల కొద్దీ ఉన్నట్టుంది.. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు..



Updated Date - 2022-01-31T03:05:08+05:30 IST