Python Massage: కొండచిలువలతో కొత్త మసాజ్.. అంత ధైర్యం మీకుందా..?

ABN , First Publish Date - 2022-07-16T23:18:30+05:30 IST

బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రిలీఫ్ కోసం చాలా మంది మసాజ్ చేయించుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా నిపుణులైన మసాజర్స్‌ కూడా ఉంటారు. కానీ ఫిలిప్పీన్స్‌లోని ఓ మసాజ్‌ సెంటర్‌లో..

Python Massage: కొండచిలువలతో కొత్త మసాజ్.. అంత ధైర్యం మీకుందా..?

బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రిలీఫ్ కోసం చాలా మంది మసాజ్(Massage) చేయించుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా నిపుణులైన మసాజర్స్‌ కూడా ఉంటారు. కానీ ఫిలిప్పీన్స్‌(Philippines)లోని ఓ మసాజ్‌ సెంటర్‌లో అడుగుపెట్టగానే గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే అక్కడ మసాజ్‌ చేసేది మనుషులు కాదు.. కొండచిలువలు.


ఫిలిప్పీన్స్‌లోని సెబూ సిటీ జూ సందర్శకులకు ఫ్రీగా మసాజ్‌ సర్వీస్ అందిస్తోంది. జూ అంతా తిరిగి అలసిపోయిన సందర్శకులకు ఫ్రీగా మసాజ్‌ సర్వీస్ అందిస్తోంది. 250 కిలోల బరువుండే భారీ బర్మీస్ కొండచిలువలతో ఉచిత మసాజ్‌ సెంటర్‌ నడుపుతున్నారు. ఇక్కడ మసాజ్ చేయించుకోవాలనుకునే వాళ్లు.. ఆ సెంటర్ నిర్వాహకులు చెప్పే సూచనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. కస్టమర్‌ను చాపపై పడుకోబెట్టి నాలుగు కొండచిలువలను వదులుతారు. 15 నిమిషాల పాటు.. కొండచిలువలు కస్టమర్‌పై తిరుగుతూ మసాజ్‌ చేస్తాయి.

Viral Video: ఈ మెట్లను మడతపెట్టొచ్చు.. చూశారంటే.. వావ్! ఏం డిజైనింగ్.. అని మీరే అంటారు..


కొండచిలువలు మసాజ్ చేస్తున్నంతసేపు.. గాలిని బలంగా వదలకూడదని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఒకవేళ భయం వేసినా.. కొండచిలువలు ఒంటిని చుట్టేసినా.. నిర్వాహకులను నెమ్మదిగా పిలవాలే తప్ప గట్టిగా అరవకూడదు. అరిస్తే ఆ కదలికలను ఆహారంగా భావించి కొండచిలువలు ఊపిరాడకుండా చుట్టేస్తాయి. మసాజ్‌ చేస్తున్నంతసేపు ఎలాంటి కదలికలు లేకుండా పడుకోవాలి. మసాజ్‌ చేసే కొండచిలువలు ఎలాంటి హాని తలపెట్టవని అంటున్నారు నిర్వాహకులు. మసాజ్‌కి ముందు ఒక్కో కొండచిలువకు 10 కోళ్లను ఆహారంగా అందిస్తారు. దీంతో వాటికి ఆకలిగా ఉండదని.. పైగా కొండచిలువలు విషపూరితం కాదు కాబట్టి ఎలాంటి ప్రాణభయం ఉండదంటున్నారు నిర్వాహకులు. మసాజ్‌ చేయించుకోవడానికి ముందు భయపడ్డ కస్టమర్లు.. మసాజ్‌ పూర్తయ్యాక భలే మజాగా ఉందంటున్నారు.

Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..



Updated Date - 2022-07-16T23:18:30+05:30 IST