కోతులు ఒక్కోసారి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. వాటి చేష్టలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని సార్లు తెగ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. మనుషులను మక్కీకి మక్కీ అనుకరించే కోతులకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అయితే పిల్లికి, కోతికి సంబంధించిన వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతి పిల్లి పట్ల చూపించే ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ తెల్లటి పిల్లిని పట్టుకుని రోడ్డు పక్కన ఉంటుంది. అదే సమయంలో రోడ్డు పక్కన కొన్ని కోతులు ఉంటాయి. వాటిలో ఓ కోతి పిల్లిని గమనించి మొదట అనుమానంగా దగ్గరికి వస్తుంది. కొద్దిసేపు పిల్లిని విచిత్రంగా చూస్తూ ఉండిపోతుంది. తాకాలా వద్దా.. తాకాలా వద్దా.. అనే సందేహంతో ముందుగా పిల్లి కాలు పట్టుకుని చూస్తుంది. ‘‘అబ్బా! ఈ పిల్లి ఎంత అందంగా ఉంది’’.. అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. తర్వాత మెల్లిగా పిల్లి ముఖంపై చేయి పెట్టి తడుముతుది. తర్వాత పిల్లి చెంప మీద ఆప్యాయంగా ముద్దు పెడుతుంది. తర్వాత ఒక్కసారిగా... ‘‘ఎందుకొచ్చిన గొడవలే’’.. అన్నట్లుగా అక్కడి నుంచి తోటి కోతుల వద్దకు వెళ్లిపోతుంది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఈ కోతికి పిల్లి మీద తెగ ప్రేమ ఉన్నట్లు ఉందే’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి