క్రూరమృగాలతో స్నేహం చేసే వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎంత శిక్షణ ఇచ్చినా మనుషులతో సింహాలు, పులులు.. స్నేహంగా ఉండడం చూస్తే ఒక్కోసారి నమ్మశక్యం కాదు. కానీ చాలా మంది పులులు, సింహాలకు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వడం ద్వారా వాటిని మచ్చిక చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా పులుల మధ్య దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. అంతటితో ఆగకుండా వాటిని కౌగిలించుకుని నిద్రపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికాలోని చిరుత పెంపకం కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డాల్ఫ్ వోల్కర్ అనే వ్యక్తి.. జంతు శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నాడు. క్రూర మృగాలపై అధ్యయనం చేయడం ఇతడికి అలవాటు. కేంద్రంలోని చిరుతలను చిన్నప్పటి నుంచే మచ్చిక చేసుకుంటూ వాటితో స్నేహంగా ఉండడం ఇతడికి అలవాటు. వీడియోలో కనబడుతున్న మూడు చిరుతలు.. ఈ కేంద్రంలోనే జన్మించాయి. రాత్రి వేళ డాల్ఫ్ వోల్కర్.. వాటి మధ్య దప్పటి వేసుకుని పడుకుంటాడు. పక్కనే ఉన్న చిరుతలు అతడ్ని చూడగానే ఎంతో ఆప్యాయంగా దగ్గరకి వెళ్తాయి. అతను వాటిని కౌగిలించుకుని పడుకోవడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను 2019 లో దక్షిణాఫ్రికాలోని బ్లూమ్ ఫోంటెయిన్లోని చిరుత పెంపకం కేంద్రంలో చిత్రీకరించారు.కాగా, ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి