చింపాంజీల గురించి అందరికీ తెలిసిందే. మనుషులను అనుకరించడంలో వాటికి మించిన జంతువులు లేవు. మనుషులు చేసే అన్ని పనులనూ అచ్చుగుద్దినట్లు చేస్తూ ఉంటాయి. కొన్ని చింపాంజీలైతే మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఎలాంటి శిక్షణ తీసుకోకున్నా మనుషుల మాదిరే చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ సినిమా పాటలో అల్లు అర్జున్ స్టెప్పును మక్కీకి మక్కీ దింపేసిందో చింపాంజి. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్టెప్పులు ప్రంపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. ఆ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట చాలా పాపులర్ అయింది. అలాగే అందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్పును చాలా మంది అనుకరిస్తూ వీడియోలు చేయడం చూశాం. ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ స్టెప్పును అనుకరించడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ చింపాంజీ.. అల్లు అర్జున్ స్టెప్పును వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ జూలో ఉన్న చింపాంజీకి ఉన్నట్టుండి అల్లు అర్జున్ గుర్తుకు వచ్చినట్లుగా.. సడన్గా అదే స్టెప్పును సేమ్ టూ సేమ్ దింపేస్తుంది. అదే సమయంలో అక్కడే ఉన్న సందర్శకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి