వీడియో కాల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌

ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST

వరుసగా కొవిడ్‌, డెల్టా, ఒమైక్రాన్‌ నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు విముక్తి దరిదాపుల్లో కనిపించటం లేదు. కొన్ని రంగాల్లో కొద్ది నెలలుగా మనుషులు కలుసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు...

వీడియో కాల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌

బ్లర్‌ ఫీచర్‌ను సపోర్ట్‌ చేసే యాపిల్‌ డివైస్‌లు: ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌,  ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ మాక్స్‌, ఐఫోన్‌ 11 సిరీస్‌, ఐఫోన్‌ ఎస్‌ఇ(సెకెండ్‌ జనరేషన్‌), ఐఫోన్‌ 12 సిరీస్‌, ఐఫోన్‌ 13 సిరీస్‌, ఐపాడ్‌ మినీ(అయిదో జనరేషన్‌ లేదాఆపై), ఐపాడ్‌(ఎనిమిదో జనరేషన్‌ ఆపై), ఐపాడ్‌ ఎయిర్‌(మూడో జనరేషన్‌ లేదా కొత్తది), 11 ఇంచ్‌ ఐపాడ్‌ ప్రొ, 12.9 ఇంచ్‌ ఐపాడ్‌ ప్రొ(మూడో జనరేషన్‌)లేదా ఆపై, ఐఔస్‌ 15 - ఐపాడ్‌ ఔస్‌ 15 - మాక్‌ ఔస్‌ తప్పనిసరి.

 

ఇలా బ్లర్‌ చేయొచ్చు

మొదటి పద్ధతి

  డివైస్‌లో ఫేస్‌టైమ్‌ ఓపెన్‌ చేసి కంట్రోల్‌ సెంటర్‌ తెరవాలి. మేక్‌పై కంట్రోల్‌ సెంటర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. ఐఫోన్‌, ఐపాడ్‌ అయితే టాప్‌ రైట్‌ కార్నర్‌ నుంచి కిందికి స్వైప్‌ చేయాలి. 

 వీడియో ఎఫెక్ట్స్‌ చూసి టాప్‌/ క్లిక్‌ చేయాలి. 

  ఫేస్‌టైమ్‌ దిగువన పోర్ట్రయిట్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. 


రెండో పద్ధతి

ఈ పద్ధతిలో కంట్రోల్‌ సెంటర్‌ను మళ్ళీ ఓపెన్‌ చేయాలి. ఆన్‌గోయింగ్‌ కాల్‌ సమయంలో వీడియో ఎఫెక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫేస్‌టైమ్‌ దిగువన పోర్ట్రయిట్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. లేదంటే ఆన్‌గోయింగ్‌ కాల్‌ స్ర్కీన్‌ నుంచి టైటిల్‌ టాప్‌/క్లిక్‌ చేయాలి. ఆపై పోర్ట్రయిట్‌ మోడ్‌ను టాప్‌ చేసి అందుబాటులోకి తెచ్చుకోవాలి. 





రీసైక్లింగ్‌ వ్యర్థాలతో ల్యాప్‌టాప్‌


ఎలకా్ట్రనిక్‌ రంగంలోనూ పర్యావరణహిత వస్తువులు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఏసర్‌ ప్రకటించిన ల్యాప్‌టాప్‌ ‘నేషనల్‌ జాగ్రఫిక్‌ ఎడిషన్‌’ను అందుకు మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. సీఈఎస్‌ 2022లో ఈ విషయాన్ని ఏసర్‌ ప్రకటించింది. ఈ వెరో రకానికి చెందిన ఒక్కో ల్యాప్‌టా్‌పను కొనుగోలు చేయడం అంటే అమెరికాలోని లాభాపేక్షరహిత సంస్థ నేషనల్‌ జాగ్రఫిక్‌ సంస్థకు సహకరించడంగానే పరిగణించాలి. సంబంధిత విద్య, పరిశోధన తదితరాలతో ప్రపంచ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించేందుకు సదరు సంస్థ కృషి చేస్తోంది. రెడ్యూస్‌, రీయూజ్‌, రీప్రాసెస్‌ విధానాన్ని ఈ ట్యాప్‌టాప్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. 30 శాతం పీసీఆర్‌ పాస్టిక్‌ చాసిస్‌ ఇందులో ఉంది.  దీంతో కర్బన ఉద్ఘారాలను 21 శాతం మేర తగ్గించవచ్చు. చైనాలో ఈ జనవరిలోనే ఈ ల్యాప్‌టాప్‌ లభ్యం కానుంది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ.75,760. అసియా - పసిఫిక్‌ ప్రాంతంలోని ఇతర దేశాల్లోనూ దీన్ని అందుబాటులోకి తేనున్నారు. గ్రీన్‌ - సుస్థిర పురోగతి విధానాలకు తోడు పదకొండో జనరేషన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంటెల్‌ ఐరిస్‌ గ్రాఫిక్స్‌తో ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ ఈ ల్యాప్‌టా్‌పలో ఉంది. వైఫై, బ్లూటూత్‌ సదుపాయాలకు తోడు ఇందులో బ్యాక్‌ పానెల్‌ను తొలగించి ర్యామ్‌ను రీప్లేస్‌ చేసుకోవచ్చు.  


వరుసగా కొవిడ్‌, డెల్టా, ఒమైక్రాన్‌ నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు విముక్తి దరిదాపుల్లో కనిపించటం లేదు. కొన్ని రంగాల్లో కొద్ది నెలలుగా మనుషులు కలుసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. కొలీగ్స్‌తో మాట్లాడుకునేందుకు ఫేస్‌టైమ్‌తో వీడియోచాట్‌ శరణ్యంగా మారింది. అయితే కాల్‌ అందుకునే సమయానికి మనం పని చేస్తున్న రూమ్‌/ప్లేస్‌ చూపించే స్థితిలో ఉండకపోవచ్చు. అటువైపు లేదంటే ఇటువైపు అవసరం లేని వ్యక్తులు కూడా పక్కన ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నేపథ్యాన్ని మసక(బ్లర్‌)బరిచే వెసులుబాటు ఫేస్‌టైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.  

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST