వీడియో కాల్‌లో పూజలు

ABN , First Publish Date - 2020-04-04T09:58:14+05:30 IST

కరోనా ప్రభావంతో పూజారులు ఎవరింటికీ వెళ్లే పరిస్థితి లేదు. కానీ చాలా కుటుంబాలకు పుణ్య తిథుల్లోనో, పండుగ రోజుల్లోనో కచ్చితంగా పూజలు నిర్వహించుకోవాలనే ఆనవాయితీ ఉంది. వారు ఇప్పుడు టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.

వీడియో కాల్‌లో పూజలు

ఆన్‌లైన్‌లో దక్షిణ

రాష్ట్రంలో కొత్తగా నడుస్తున్న ట్రెండ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో పూజారులు ఎవరింటికీ వెళ్లే పరిస్థితి లేదు. కానీ చాలా కుటుంబాలకు పుణ్య తిథుల్లోనో, పండుగ రోజుల్లోనో కచ్చితంగా పూజలు నిర్వహించుకోవాలనే ఆనవాయితీ ఉంది. వారు ఇప్పుడు టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. తాజాగా శ్రీరామనవమికి ఇళ్లల్లో పూజలకు, వాట్సాప్‌ వీడియోకాల్‌లోనే భక్తులు పూజలు కానిచ్చేశారు. పంతులుగారి మంత్రోచ్ఛారణ ఇటువైపు, పూజ తంతు అటువైపు చకచకా జరిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పూజ పూర్తైన తర్వాత, దక్షిణ కూడా ఆన్‌లైన్‌లోనే పంతులుగారి ఖాతాలోకి చేరిపోయింది.

Updated Date - 2020-04-04T09:58:14+05:30 IST