Viral Video: వీళ్లేంటీ.. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.. మరీ విచిత్రంగా ఉన్నట్టున్నారే..

ABN , First Publish Date - 2022-03-01T22:39:04+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వారు ఈ పని కావాలని చేశారో, లేక నిజంగానే తెలీక చేశారో.. తెలీదు గానీ మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ..

Viral Video: వీళ్లేంటీ.. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.. మరీ విచిత్రంగా ఉన్నట్టున్నారే..

కొందరు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే ‘‘మనిషి పెరిగినా మెదడు పెరగలేదు’’.. అని పెద్దలు అంటూ ఉంటారు. మరికొందరైతే ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లల తరహా చేష్టలు చేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా వారి పద్ధతిని మాత్రం మార్చుకోరు. ఇంకొందరైతే అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో కావాలనే విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వారు ఈ పని కావాలని చేశారో, లేక నిజంగానే తెలీక చేశారో.. తెలీదు గానీ మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. తాము కూర్చున్న కొమ్మలను వారే నరుక్కోవడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ చెట్టుపై వేర్వేరు కొమ్మలపై ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. కాసేపు ఆగాక ఒకరినొకరు మాట్లాడుకుని చివరకు ఒక నిర్ణయానికి వస్తారు. ఓ వ్యక్తి మరో వ్యక్తి కూర్చున్న కొమ్మను నరికేస్తాడు. ఇలా ఇద్దరూ ఒకరి కొమ్మను ఒకరు నరుక్కుంటూ కనిపిస్తారు. కొద్దిసేపు ఒకరు నరికితే.. తర్వాత ఇంకొకరు నరకడం.. చూసిన వారికి నవ్వు తెప్పిస్తుంది. అయితే వారు ఉన్న చెట్టు కింద నది ఉండడంతో కిందపడ్డా ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు.. వారు కావాలనే ఇలా చేశారు’’.. అని కొందరు అంటుంటే.. ‘‘ ఇంత తింగరి చేష్టలేంటయ్యా బాబూ’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. 

నాలుగేళ్లుగా హోటల్లో ఒకే గదిని బుక్ చేసుకున్న యువకుడు.. లోపలికి వెళ్లిన సిబ్బందికి ఊహించని షాక్.. చివరకు ఏమైందంటే..





Updated Date - 2022-03-01T22:39:04+05:30 IST