Abn logo
Aug 3 2021 @ 23:38PM

విడవలూరులో లాక్‌డౌన్‌

కరోనాపై సమావేశం నిర్వహిస్తున్న అధికారులు

ఉదయం 5నుంచి 10వరకు దుకాణాలు

ప్రజలు సహకరించాలని కోరిన అధికారులు


విడవలూరు, ఆగస్టు 3: మండలంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దారు చంద్రశేఖర్‌, ఎంపీడీవో చిరంజీవి, స్థానిక ప్రజాప్రతినిధులు, దుకాణ దారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ తొలివిడతగా  రామతీర్థం, ఊటుకూరు, విడవలూరులో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నందున ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 నుంచి 10 వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైనా బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ అధికారులు లాక్‌డౌన్‌ విధించిన గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.