Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 14:26:21 IST

Vicky The Rock Star: ఆకట్టుకుంటున్న రివల్యూషన్ షేడ్..

twitter-iconwatsapp-iconfb-icon

విక్రమ్ (Vikram), అమృత చౌదరి (Amrutha Chowdari) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విక్కి ది రాక్ స్టార్' (Vicky The Rock Star). తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సిఎస్ గంటా (C S Ghanta) దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్ తో శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (IAF) నిర్మాత. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. 

విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌, లవ్ షేడ్‌లకు మంచి స్పందన వచ్చింది.‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ అనే పాటతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో ఎమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేశారు. రివల్యూషన్ షేడ్ అంటూ తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్లు ఓ వీడియోను విడుదల చేశారు. ‘చచ్చిపోవడం అంటే ప్రాణాలతో లేకపోవడం కాదురా.. ధైర్యం లేకుండా బతకడం కూడా చచ్చినట్టే అని తల్లి చెప్పడం.. ‘ధైర్యం కావాలంటే ఏం చేయాలి అమ్మా?’ అని పిల్లాడు అడగటం.. ‘ధైర్యం కావాలంటే ప్రాణాల మీద ఆశ వదిలి.. పక్కోళ్ల ప్రాణాల కోసం పోరాడు.. ధైర్యం అదే వస్తుంది’ అంటూ ఆ తల్లి చెప్పిన మాటలతో ఈ సినిమాలో కథ, కథనాలు ఎలా ఉండబోతోన్నాయో అర్థమైంది. ఇక ఈ రివల్యూషన్ షేడ్‌తో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో, ఫస్ట్ షేడ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని ఇప్పటికే వదిలిన అప్డేట్స్ తెలుపుతున్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement