జీవితానికి అర్థమిదే అంటూ కామెంట్ చేసిన Vicky Kaushal మాజీ లవర్ హార్లీన్ సేథీ

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకొబోతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో వీరి వివాహం జరగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులందరూ హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో విక్కీ కౌశల్, హార్లీన్ సేథీ అనే నటితో డేటింగ్ చేశాడు. ఇద్దరి మధ్య పొసగకపొవడంతో అనంతరం విడిపోయారు. 


విక్కీ పెళ్లి పీటలను ఎక్కబోతుండటంతో అతడి మాజీ లవర్ హార్లీన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ జీవితానికి అర్థమిదే ’’ అంటూ విక్కీ పెళ్లి సమయంలోనే  ఆమె పోస్ట్ చేయడంతో అది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘‘ మీరు జీవితానికి అర్థం వెతుకుతున్నారంటే టోస్ట్ గురించి అర్థం వెతుకుతున్నట్టే. అందుకు బదులుగా కొన్ని సార్లు టోస్ట్ తినడమే మంచిది ’’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సరిగ్గా విక్కీ పెళ్లి సమయంలోనే ఈ పోస్ట్ చేయడంలోని అంతర్యామేమిటని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.


విక్కీ కౌశల్, హార్లీన్ సేథీ 2019లో కొన్ని నెలలు డేటింగ్ చేశారు. అతడు హీరోగా తెరకెక్కిన ‘‘ఉరీ : ది సర్జికల్ స్ట్రైక్ ’’ సినిమా విడుదల అనంతరం వీరిద్దరూ విడిపోయారు.

Advertisement

Bollywoodమరిన్ని...