విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లిపై స్పందించిన అతడి సోదరి

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో డిసెంబరు రెండో వారంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అంతకు ముందే నవంబర్ చివరి వారంలో ముంబైలో వీరు కోర్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. కానీ, ఈ వార్తలపై కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఎవరూ కూడా స్పందించలేదు. తాజాగా ఈ వదంతులపై విక్కీ కౌశల్ కజిన్ సోదరి స్పందించింది. 


విక్కీ కౌశల్ కజిన్ సోదరి అయిన ఉపాసన వోహ్రా తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..‘‘ వారిద్దరూ డిసెంబరులో వివాహం చేసుకోవట్లేదు. అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే. ఇప్పట్లో వారికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. వివాహం చేసుకోవాలనుకుంటే మీడియాకు వారు తప్పకుండా వెల్లడిస్తారు. నేను ఈ మధ్యనే నా సోదరునితో మాట్లాడాను. అటువంటీది ఏమి లేదని అతడు చెప్పాడు. ఈ విషయంపై నేను ఇంతకంటే ఎక్కువగా స్పందించలేను. ప్రస్తుతానికైతే వారు పెళ్లి చేసుకోవట్లేదు ’’ అని ఆమె చెప్పింది.


పెళ్లిని వారు రహస్యంగా జరుపుకోబోతున్నారు కాబట్టే విక్కీ కౌశల్ సోదరి ఆ విధంగా చెప్పిందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.

Advertisement