Katrina Kaif, విక్కీ కౌశల్ వెడ్డింగ్ కార్డ్ లీక్.. ఫొటోలు వైరల్..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకొబోతున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలకు దాదాపుగా 120మంది అతిథులుగా రాబోతున్నట్టు మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పీఎమ్‌వో నుంచి కూడా 5గురు అధికారులు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది.


పెళ్లికి ముందు జరిగే సంబరాలైన సంగీత్, మెహందీ డిసెంబర్ 7, 8 తేదీల్లో జరగనున్నాయి. అంతకు ముందే గతవారంలో వీరు ముంబైలో కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లను తీసుకురావొద్దని ఈ వేడుకలకి హాజరుకాబోయే అతిథులకి విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ చెబుతున్నారు. తమ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావొద్దని ఈ జంట భావిస్తోంది. అందుకు కారణమేంటంటే వీరు తమ పెళ్లి ఫొటోలు, వీడియో రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌కు దాదాపుగా రూ.100కోట్లకు అమ్మేశారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా కత్రినా కైఫ్ వెడ్డింగ్ కార్డ్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. అభిమానులందరూ ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్‌లో డిసెంబర్ 9న విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి చేసుకొబోతున్నారని ఉంది. కొంత మంది నెటిజన్లు మాత్రం ఈ వెడ్డింగ్ కార్డ్ ఫేక్ అని కామెంట్ చేస్తుండటం విశేషం.
Advertisement

Bollywoodమరిన్ని...