Oct 27 2021 @ 11:30AM

తనకంటే వయసులో ఐదేళ్లు చిన్నోడితో Katrina Kaif పెళ్లి..? Vicky Kaushal ఏం చెప్పాడంటే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన కంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన హీరో విక్కీ కౌశల్‌తో డేటింగ్ చేస్తోందనే సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌కు బ్రేకప్ చేసిన తర్వాత విక్కీకి కత్రిన దగ్గరైంది. వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ గురించిన వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరికీ నిశ్ఛితార్థం అయిపోయిందని గత నెలలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి కేవలం పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. తాజాగా వీరి పెళ్లి గురించిన వార్తలు మొదలయ్యాయి. 


ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్కీ కౌశల్ త్వరలోనే నిశ్ఛితార్థం ఉంటుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ చివర్లో లేదా డిసెంబర్‌లో విక్కీ కౌశల్, కత్రినల పెళ్లి ఉంటుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలయ్యాయని, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి వీరి పెళ్లి దుస్తులను డిజైన్ చేస్తున్నారని ప్రముఖ మీడియాలో వార్తలు వచ్చాయి. మంగళవారం రాత్రి వీరిద్దరూ తమ మేనేజర్ రేష్మ షెట్టిని కలిశారు. పెళ్లి గురించి చర్చలు జరిపేందుకే వీరిద్దరూ మేనేజర్‌ను కలిశారని సమాచారం. మరి, ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.  

Bollywoodమరిన్ని...