సినిమాల్లో అశ్లీలత, వైయోలెన్స్ పెరిగిపోతున్నాయి: Venkaiah

ABN , First Publish Date - 2022-04-28T16:03:11+05:30 IST

సినిమాల్లో అశ్లీలత, వైయెలెన్స్ పెరిగిపోతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

సినిమాల్లో అశ్లీలత, వైయోలెన్స్ పెరిగిపోతున్నాయి: Venkaiah

నెల్లూరు: సినిమాల్లో అశ్లీలత, వైయెలెన్స్ పెరిగిపోతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఉదయం వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... కుటుంబంతో వెళ్లి చూసేలా సినిమా ఉండాలని... డైరెక్టర్లు, పాటలు, మాటల రచయితలు ఆ విధమైన సినిమాలు తీయాలని సూచనలు చేశారు. ప్రతీ ప్రాంతంలో గ్రంథాలయం, దేవాలయం, వైద్యాలయం, సేవాలయం ఉండాలని, మనం పుట్టిన గ్రామానికి ఏదో ఒక సహాయం చేయాలని అన్నారు. 21 సంవత్సరాల ముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవా దృక్పథంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి పధంలో ఇండియా ముందుకు వెళుతోందని చెప్పారు. అందరూ ఆరోగ్యంకరంగా ఉండాలని.... అందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచించారు.

Updated Date - 2022-04-28T16:03:11+05:30 IST