న్యూఢిల్లీ: జమ్మూ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పులో జవాన్ జస్వంత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఉగ్రవాదులతో సాగిన పోరులో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన శ్రీ మరుప్రోలు జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారని తెలిసి ఎంతో విచారించాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.