విజయవాడ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి రోడ్డు మార్గాన నేరుగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యకు ప్రత్యేక పోలీసు దళాలు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో వెంకయ్యకు గవర్నర్ విశ్వ భూషణ్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళ్లారు.