సినిమా.. ప్రేక్షకుడికి సంస్కారాన్ని నేర్పాలి: Vice president వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2022-05-21T02:28:37+05:30 IST

సినిమా.. ప్రేక్షకుడికి సంస్కారాన్ని నేర్పాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. సిరివెన్నెల సీతారామశాస్ర్తి జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఏర్పాటు

సినిమా.. ప్రేక్షకుడికి సంస్కారాన్ని నేర్పాలి: Vice president వెంకయ్య నాయుడు

Hyderabad: సినిమా.. ప్రేక్షకుడికి సంస్కారాన్ని నేర్పాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. సిరివెన్నెల సీతారామశాస్ర్తి జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిరి వెన్నెల రాసిన ప్రతి పాట, మాటలో సందేశం ఉంటుందన్నారు. సినిమా వినోదాన్ని పంచడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా పంచేవిగా ఉండాలన్నారు. మాయాబజార్ లాంటి సినిమాలు 100 రోజులు ఆడితే.. ఇప్పటి సినిమాలు ఫస్ట్ షో ఉంటుందా? లేదో కూడా తెలియదు పరిస్థితి ఉందన్నారు. వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లుగా సినిమాలు ఉన్నాయన్నారు. సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలని సూచించారు.  సిరి వెన్నెలతో తనకు  స్నేహం ఉందని, సిరి వెన్నెల సమగ్ర సాహిత్య పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో శిల్ప కళా వేదిక మీది నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ అమరేష్ కుమార్‌కు సానుభూతి తెలిపారు.  

Updated Date - 2022-05-21T02:28:37+05:30 IST