క్రీడా సంస్కృతిని పెంపొందించాలి

ABN , First Publish Date - 2021-08-30T08:33:18+05:30 IST

పాఠశాల స్థాయి నుంచే క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.

క్రీడా సంస్కృతిని పెంపొందించాలి

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు 

న్యూఢిల్లీ: పాఠశాల స్థాయి నుంచే క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫేస్‌బుక్‌లో తన సందేశాన్ని పోస్టు చేశారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాల్సిన వ్యవస్థను రూపొందించాలని కోరారు. ‘అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నడూ లేనన్ని ఎక్కువ పతకాలు సాధించడం ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రస్తావించాల్సిన ముఖ్య విషయాలు’ అని వెంకయ్య రాశారు.  


‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ ఆవిష్కరణ:

‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’ రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫిట్‌ ఇండియా మొబైల్‌ యాప్‌ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆవిష్కరించారు. జాతీయ క్రీడాదినోత్సవం రోజున భారత ప్రజలకు.. ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అని చెప్పారు. ఈ యాప్‌ వ్యక్తిగత శిక్షకుడిగా, మార్గదర్శిగా పని చేస్తుందని చెప్పారు. 

Updated Date - 2021-08-30T08:33:18+05:30 IST