వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-05-26T03:42:07+05:30 IST

నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో బుధవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా ని

వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు
ఆత్మకూరులో నిర్వహిస్తున్న ఆంజనేయ స్వామి సమేత సువర్చలాదేవి కల్యాణం


ఆత్మకూరు, మే 25 :  నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో బుధవారం  హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పట్టణ సమీపంలోని హనుమాన్‌ జంక్షన్‌లో వెలసి ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో  బుధవారం తెల్లవా రుజామున 5 గంటలకు పంచామృతాభిషేకం, సహస్రనా మపూర్వక ఆకుపూజ, హనుమంతచాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం ఇరుముడులు ధరించిన భక్తులు శోభా యాత్ర నిర్వహించారు. అభయాంజనేయస్వామి సమేత సువర్చలాదేవి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా సుధాకర్‌రెడ్డి దంపతులు వ్యవహరించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం 60 అడుగుల అభయాంజనేయస్వామికి పాలభిషేకం జరిగింది. ఆత్మకూరులోని ఆర్యవైశ్య కోదండరామస్వామి దేవస్థానంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణంహనుమాన్‌జీ, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.  సుందరమ్మ ఆలయ ఆవరణలో వెలసి ఉన్న కోదండరామాంజనేయస్వామి ఆలయం లో స్వామివారికి చందనాలంకారం, లక్షపత్రసామూహిక ఆకుపూజ భనిర్వహించారు. మండలంలోని మహిమలూరు, వెన్నవాడ,  కరటంపాడు, దేపూరు, వాసిలి, తదితర గ్రామాల్లో కూడా హనుమజ్జయంతి వేడుకలను  నిర్వహించారు.


  వలేటివారిపాలెంలో...

 

వలేటివారిపాలెం : మండలంలోని పోలినేనిపాలెం, వలేటివారిపాలెం గ్రామాల్లో బుధవారం హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆంజనేయస్వామి విగ్రహనికి ప్రత్యేక అలంకరణ చేశారు. మాలధారణ చేసిన స్వాములు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పలువురు దాతలు మజ్జిగ, తాగునీరు, రస్నాను ఉచితంగా అందజేశారు.  పోలినేనిపాలెం, వలేటివారిపాలెం ఆంజనేయ స్వామి ఆలయాలను కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.కాగా వలేటివారిపాలెంకు చెందిన దాత కాకుమాను అనిల్‌ భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బస్టాండు సెంటరు నుంచి  ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వరకు భక్తులకు ఉచిత ఆటో వసతి కల్పించారు.


 సంగంలో...


సంగం :  సంగంలో వెలసి ఉన్న వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతిని పురస్కరించుకుని బుధవారం వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు నిర్వహించి, పూలంగిసేవ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. 


అనంతసాగరంలో..


అనంతసాగరం : మండలంలోని ఆగ్రహారం, రేవూరు, అనంతసాగరం, ఉప్పలపాడు గ్రామాల్లోని రామాలయాల్లో బుధవారం హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప్పలపాడు కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల  కల్యాణం కమనీయంగా జరిగింది. 









Updated Date - 2022-05-26T03:42:07+05:30 IST