వైభవంగా రొట్టెల పండుగ

ABN , First Publish Date - 2022-08-12T03:47:54+05:30 IST

స్థానిక పెద్దచెరువులో గురువారం సాయంత్రం రొట్టెల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ పండుగకు హిందూ, ముస్లింలు అధి

వైభవంగా రొట్టెల పండుగ
రొట్టెలు మార్చుకుంటున్న భక్తులు

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 11 : స్థానిక పెద్దచెరువులో గురువారం సాయంత్రం రొట్టెల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ పండుగకు హిందూ, ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై చెరువులో రొట్టెలు మార్చుకున్నారు. ప్రతి ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ సమయంలో ఉదయగిరిలో సైతం రొట్టెల పండుగను నిర్వహించడం కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ.  కాగా ఉద్యోగ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం తదితర రొట్టెలకు ఇక్కడ డిమాండ్‌ ఏర్పడింది. రొట్టెలు మార్చుకున్నాక  భక్తులు గన్‌షహీద్‌  ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


-----------

Updated Date - 2022-08-12T03:47:54+05:30 IST