వైభవంగా ధ్వజావరోహణ

ABN , First Publish Date - 2022-06-30T03:02:48+05:30 IST

మండలంలోని రామతీర్థంలో జరుగుతున్న కామాక్షీదేవి సమేత రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు బుధవారం ద్వజావరోహణ

వైభవంగా ధ్వజావరోహణ
ధ్వజావరోహణ నిర్వహిస్తున్న అర్చకులు

ముగిసిన రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

దేవదాయశాఖకు పెరిగిన ఆదాయం

విడవలూరు జూన్‌ 29: మండలంలోని రామతీర్థంలో జరుగుతున్న కామాక్షీదేవి సమేత రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు బుధవారం ద్వజావరోహణతో ముగిశాయి.  రెండేళ్ల అనంతరం నిర్వహించిన ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి  భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ పూజారి పేరేపి శ్రీకాంత్‌శర్మ  ధ్వజస్తంభానికి కట్టిన కొడి గుడ్డను కిందకు దింపారు. ఆన ంతరం సంతానం లేని మహిళలకు కొడిముద్దలను పంచిపెట్టారు. రామతీర్థం గ్రామానికి చెందిన నాశిన వెంకట శేషయ్య, వెంకట శేషమ్మ దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం స్వామి,అమ్మవారికి పూలంగిసేవ నిర్వహించారు. రాత్రికి ఏకాంతసేవను నిర్వహించారు. ఈ వేడుకలకు స్వర్గీయ కొమారి చిన్నవెంకయ్య కుటుంబ సభ్యులు, కొనగళ్ళ వెంకటశెట్టిలు ఉభయకర్తలుగా వ్యవహరించారు. 





Updated Date - 2022-06-30T03:02:48+05:30 IST