గోకుల కృష్ణ గోపాల కృష్ణ..

ABN , First Publish Date - 2022-08-20T06:36:44+05:30 IST

గోకుల కృష్ణ గోపాల కృష్ణ..

గోకుల కృష్ణ గోపాల కృష్ణ..
ఎస్‌.ఎన్‌.పాలెంలో ఉట్టి కొట్టేందుకు ఉత్సాహపడుతున్న యువకులు

ఉయ్యూరు, ఆగస్టు 19 : కృష్ణాష్టమి వేడుక ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కృష్ణాష్టమితో పాటు శ్రావణ శుక్రవారం కలసి రావడంతో ఉయ్యూ రు, రూరల్‌ మండల పరిధి గ్రామాల్లో చిన్నా పెద్దా తేడాలేకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణాలయాలు, కనకదుర్గ, వీరమ్మ ఆలయాల వద్ద మహి ళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో యువకులు, బాలురు ఉత్సాహంగా పాల్గొని ఉట్టికొ ట్టారు. ఉయ్యూరు ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలో చిన్నికృష్ణుడు, గోపికల వేషాధారణలో  చిన్నారులు అబ్బుర పరిచా రు. సంస్కృతి సంప్రదాయాలపై చిన్ననాటి నుంచి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు స్కూల్‌ డైరెక్టర్‌  బాబు తెలిపారు. 

పెనమలూరు : మండలంలోని పలు ప్రాంతాల్లో  శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిం చారు.  పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలా డాయి. కోలాటం, ఉట్టికొట్టడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పోరంకిలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి పాఠశాలలో కృష్ణాష్టమి  ఘనంగా జరిపారు. పాఠ శాల డైరెక్టరు చంద్రశేఖరరావు, ప్రిన్సిపాల్‌ మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు గోపికా నృత్యాలు, కోలాటం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలతో అలరించారు.

ఫ తాడిగడపలో మేడసాని భారతి, సాంబశివ రావు దంపతులు నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు గ్రామస్థుల మధ్య జరిగాయి. శ్రీజ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వర భక్త సమాజం, వణుకూరు శ్రీసాయి సీతారామాంజనేయ భక్తసమాజం  భజన కార్యక్ర మాన్ని నిర్వహించారు.  

విజయవాడ రూరల్‌  : కృష్ణాష్టమి వేడుకలు మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాలల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, పీ నైనవరం తదితర గ్రామాలలో వేడుకలు వైభవంగా జరిగాయి. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : మండలంలోని రంగన్నగూడెం, వీరవల్లి, దంటగుంట్ల, కె.సీతారాం పురం, ఎస్‌.ఎన్‌.పాలెం, మల్లవల్లి, తదితర గ్రామాల్లో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు   వైభవంగా నిర్వ హించారు. రంగన్నగూడెంలోని శ్రీకృష్ణమందిరంలో ఎంపీటీసీ పుసులూరి లక్ష్మీ నారాయణ, కమిటీ సభ్యు లు కొలుసు గంగాజలం, దేవరకొండ భవాని తదిత రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం మేళతాళాల మధ్య వైభవంగా గ్రామోత్సవం నిర్వ హించారు. కసుకుర్తి వేణు, కాట్రు పాపారావు, సుధీర్‌ తదితరులు పర్యవేక్షించారు. వీరవల్లి గీతామం దిరంలో శ్రీకృష్ణునివిగ్రహానికి అర్చకులు సాంబశివ రావు పర్యవేక్షణలో క్షీరాభిషేకం నిర్వహించి వాసు బోయిన శివకుమార్‌ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాబూరావు, కోడెబోయిన బాబి, చలాది పండమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఎస్‌.ఎన్‌.పాలెం లో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో బొల్లిగర్ల రామ్మోహ నరావు పర్యవేక్షణలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువత కేరింతల మధ్యఎంపీపీ యరగొర్ల నగేష్‌, సర్పంచ్‌ ఆడపా అంజిబాబు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువకుల ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు కంపసాటి కొండలరావు, వీరమాచనేని బుజ్జి, తదితరులు పాల్గొన్నారు. దంటగుంట్ల, తదితర గ్రామాల్లో చిన్నారులకు కృష్ణుడు, గోపికల వేష ధారణలు వేసి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. 

ఫ జాతీయ రహదారి విస్తరణలో తొలగించిన పురా తన శ్రీకృష్ణుని విగ్రహాన్ని వీరవల్ల్లిలో శుక్రవారం పునఃప్రతిష్టించి పూజలు నిర్వహించారు. వీరవల్లి పీహెచ్‌సీలోని 50 ఏళ్ల చరిత్ర గల శ్రీకృష్ణుని విగ్రహా న్ని మోర్ల ఆంజనేయులు, పీహెచ్‌సీలోని యూడీ సీధర్మారావుఆర్ధిక సహకారంతో విగ్రహానికి నూతన సొబగులద్ధి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పీహెచ్‌సీ ఆవరణలో ప్రతిష్టిం చారు. తన స్వంత ఖర్చులతో మందిరం నిర్మిస్తానని పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గూడవల్లి సుధాకర్‌ ఈ సందర్భం గా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి గోపాల్‌, డాక్టర్‌ కిరణ్మయి, ఎంపీహెచ్‌వో లు శ్రీనివాస్‌, స్వామి, సౌదామణి పాల్గొన్నారు.

గన్నవరం : మండలంలోని పలు గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక యాదవుల పేటలోని రామాలయం వద్ద నుంచి ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై శ్రీకృష్ణుడిని కుర్చోబెట్టి గ్రామోత్సవం నిర్వహించారు. ముస్తాబాద పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షులు మేచినేని బాబు, సూరపనేని అనిల్‌కుమార్‌, చిమట గంగాధర్‌, సర్నాల రమేష్‌, ఢిల్లీ పాములు, చిమట రవివర్మ, బుజ్జి తదితరులు పాల్గొని పూజలు చేశారు. తెంపల్లిలో నాగనబోయిన గిరీష్‌రాజ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉట్టి కొట్టుడు పెట్టి గెలుపొందిన వారికి ఆత్కూరు ఎస్సై కిషోర్‌కుమార్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. 

ఉంగుటూరు  : కృష్ణాష్టమి వేడుకలను మండలంలోని అన్నిగ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు కృష్ణుడి ఆలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణనామసంకీర్తనలు, భజనలతో ఆలయాలు మార్మోగాయి. మహిళలు, చిన్నారులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం మండల కేంద్రమైన ఉంగుటూరులో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొనేందుకు యువకులు పోటీపడ్డారు. యువతీ యువకుల కేరింతల నడుమ స్ధానిక వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. 

Updated Date - 2022-08-20T06:36:44+05:30 IST