0waisi vs Vhp వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే ఓవైసీకి ఉలుకెందుకు?: VHP

ABN , First Publish Date - 2022-05-18T20:20:05+05:30 IST

ప్రఖ్యాత జ్ఞానవాపి మందిరం విషయంలో ఎం.ఐ.ఎం అధినేత, హైదరాబాద్ ఎం.పీ అసదుద్దీన్ ఓవైసీ(asaduddin owaisi) తీరు చూస్తుంటే జాలి వేస్తోందని,

0waisi vs Vhp వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే ఓవైసీకి  ఉలుకెందుకు?: VHP

హైదరాబాద్: ప్రఖ్యాత జ్ఞానవాపి మందిరం విషయంలో ఎం.ఐ.ఎం అధినేత, హైదరాబాద్ ఎం.పీ అసదుద్దీన్ ఓవైసీ(asaduddin owaisi) తీరు చూస్తుంటే జాలి వేస్తోందని, "గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు" వ్యవహరించడం సిగ్గుచేటని విహెచ్ పి తెలంగాణ శాఖ సహ ప్రముఖ్ బాలస్వామి(bala swamy)పేర్కొన్నారు. ఇన్నాళ్లు మసీదుగా మార్చుకొని ఉన్న ప్రదేశంలో శివలింగంతో పాటు మిగతా నంది ,హిందూ కట్టడాలు బయటపడటం జీర్ణించుకోలేక ఓవైసీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. తాను రాజ్యాంగంపై గౌరవం ఉన్న వ్యక్తిని  అంటూనే...కోర్టు తీర్పులను తప్పు పడుతూ వ్యాఖ్యానించడం ఓవైసీకి తగదని అన్నారు. "నాకు రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది.. కాబట్టి నేను మాట్లాడుతాను" అంటూ కోర్టు తీర్పుపై విమర్శ చేయడం నేరమన్నవిషయం తెలుసుకోవాలన్నారు.


ఉత్తరప్రదేశ్ వారాణసిలోని జ్ఞానవాపి మందిరం కాంప్లెక్స్ లో గల బావిలో పవిత్రమైన శివలింగం బయటపడింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ శుభ పరిణామాన్ని ప్రపంచమంతా ఆహ్వానించింది. హిందూ సమాజం అంతా హర్షిoచింది. మరీ ముఖ్యంగా శివలింగం బయటపడిన ప్రాంతాన్ని, బావిని సీల్ చేసి.. అక్కడకు ఎవరూ  వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని వారణాసి కలెక్టర్, పోలీస్ కమిషనర్, సి ఆర్ పిఎఫ్ కమాండోలను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఆదేశించారు కూడా.అయినా కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఓవైసీ మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం. అయోధ్యలోని బాబ్రీ మసీదు  లాగా జ్ఞానవాపి మసీదును కానివ్వబోమని అసదుద్దీన్ వ్యాఖ్యానించడం తీవ్ర ఆక్షేపణీయమని బాలస్వామి విమర్శించారు.


కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేస్తున్నా...చట్టాన్ని ఉల్లంఘించి సర్వే చేస్తున్నట్లు ఆయన ఆరోపణ, వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయన్నారు."మోదీకి, యోగికి నేను భయపడను అంటూ మాట్లాడే ఆయన మాటల్లోనే భయం కనిపిస్తోంది".నేను అంతరాత్మను అమ్ముకోను.. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అంటూనే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, కోర్టు తీర్పు పై మాట్లాడడం చట్టవిరుద్ధమని అన్నారు.1991 చట్టం రద్దుచేసి హిందూ అస్తిత్వం కాపాడాలి...హిందువుల మనోభావాలు దెబ్బ తీసి, హిందూదేవాలయాలు, భూములు, ఆస్తులు కోల్పోయేలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన "చట్టం -1991 లోని సెక్షన్ 4 (2)" వెంటనే సవరించి హిందూ దేవాలయాలను, హిందూ ఆస్తులను మొత్తంగా హిందూ అస్తిత్వాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. "ఇది ముమ్మాటికీ ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన చట్టం" అని ఓవైసీ గుర్తించాలి.



బాబ్రీ మసీదు లాక్కోలేదు... పోరాడి సాధించుకున్నము..!ఆర్.ఎస్.ఎస్ ,బిజెపి కుట్రలు పన్ని అయోధ్య బాబ్రీ మసీదు లాక్కోన్నాయని...వాటి తరహాలోనే జ్ఞానవాపి మసీదును లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఓవైసీ ఆరోపించడం ఆయన అవివేకానికి  నిదర్శనమని బాలస్వామి పేర్కొన్నారు. ముమ్మాటికీ జ్ఞాన వాపి  అనేది మందిరమే.న్యాయబద్ధంగా పోరాడి మందిరాన్ని సాధించుకు తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మొగలుల పాలనలో ధ్వంసమైన దేవాలయాల గురించి మాత్రమే మా పోరాటం. మొగలులు నిర్మించుకున్న మసీదులు మాకు అక్కరలేదు. "లక్షల కొద్దీ దేవాలయాలు దాడులకు గురయ్యాయి, ధ్వంసమయ్యాయి, దోపిడీ జరిగింది. మెజారిటీగా ప్రతి మసీదు కింద ఓ దేవాలయం ఉందని ఆయన అన్నారు. 

Updated Date - 2022-05-18T20:20:05+05:30 IST