ఇలా అమ్ముకుంటూ పోతే శ్మశానాలకు కూడా స్థలం దొరకదు: వీహెచ్

ABN , First Publish Date - 2021-06-15T18:23:33+05:30 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్‌లో శ్మశానాలకు కూడా స్థలం దొరకదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు.

ఇలా అమ్ముకుంటూ పోతే శ్మశానాలకు కూడా స్థలం దొరకదు: వీహెచ్

హైదరాబాద్‌: ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్‌లో శ్మశానాలకు కూడా స్థలం దొరకదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములు అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు భూములన్నీ అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా? అని ప్రశ్నించారు. పార్టీలన్నీ కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వీహెచ్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకే పీసీసీ ఇవ్వాలన్నారు. 2019 ఏప్రిల్ 12న జై భీం కార్యకర్తలు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేయగా.. మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. మళ్ళీ తాము విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తే తీసుకువెళ్లి గోశామహల్ పోలీస్ స్టేషన్‌లో పెట్టారని వీహెచ్ పేర్కొన్నారు. 

కల్నల్ సంతోష్ విగ్రహం పెట్టడం సంతోషమే కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. అసదుద్దీన్ ఒవైసి, చాడా వెంకట్ రెడ్డి, ఎల్ రమణ, ఉత్తమ్, భట్టితో మాట్లాడానన్నారు. అంబేద్కర్ విగ్రహం కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేస్తానన్నారు. ఈ నెల 17న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు వీహెచ్ వెల్లడించారు.

Updated Date - 2021-06-15T18:23:33+05:30 IST