Abn logo
Jun 3 2020 @ 14:04PM

డీజీపీ ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు: వీహెచ్‌

హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్‌లో భౌతికదూరం పాటించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. తాము ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తుంటే అరెస్ట్‌ చేశారని.. డీజీపీ ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే లేవని గుర్తుంచుకోవాలన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. కేసీఆర్‌ ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని.. మీరూ అరెస్ట్‌ అయ్యే రోజులు వస్తాయని వీహెచ్ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement