Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇన్నాళ్లూ కుమ్ములాటల పార్టీ అని పేరుండేది.. ఇప్పుడు రేవంత్‌తో కలిసి పని చేస్తున్నాం: వీహెచ్

వికారాబాద్ : ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ అంటే కుమ్ములాటాల పార్టీ అనే పేరు ఉండేదని...కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఓటు మీకే వేశారని... రైతుల సమస్యలను మీరే తీర్చాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతు సమ్యలను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. మీమీద నమ్మకంతో కారు గుర్తుకు ఓటేస్తే నరేంద్రమోదీ పేరు చెప్పి వరి ధాన్యం కొనకపోవడమేంటని వీహెచ్ ప్రశ్నించారు. రైతు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. జిల్లా మంత్రి సబితా రెడ్డి చొరవ తీసుకొని జిల్లాలోని రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయడానికి సిద్దంగా ఉన్నామని వీహెచ్ తెలిపారు.

Advertisement
Advertisement