వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి వీజీసీబీ చేయూత

ABN , First Publish Date - 2022-08-03T03:09:51+05:30 IST

తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో భాగంగా వేదాంతకు చెందిన వీజీజీసీ ఇప్పుడు విశాఖపట్నంలోని క్వీన్‌ మేరీస్‌

వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి వీజీసీబీ చేయూత

విశాఖపట్టణం:  తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో భాగంగా వేదాంతకు చెందిన వీజీసీబీ ఇప్పుడు విశాఖపట్నంలోని క్వీన్‌ మేరీస్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో  మౌలిక వసతుల అభివృద్ధికి చేయూత అందించింది. పాఠశాలకు 9 కంప్యూటర్లు అందించడంతోపాటు ఓ కంప్యూటర్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీనితో పాటుగా విద్యార్థులందరికీ కంప్యూటర్‌ శిక్షణను అందించేందుకు శిక్షకుడిని సైతం నియమించింది. అలాగే, పాఠశాలలో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా తోడ్పాటు అందిస్తోంది.


వీజీసీబీ మౌలికల వసతుల అభివృద్ధి కార్యక్రమాలను చైతన్య స్రవంతి ఫౌండింగ్‌ చైర్ పర్సన్ డాక్టర్ షిరిన్ రెహమాన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కంప్యూటర్లను పాఠశాల అధికారులకు అప్పగించారు.  ఈ కార్యక్రమంలో  వైజాగ్‌ మండల విద్యాశాఖాధికారి  కొర్ర సువర్ణ, వైఎస్‌ఆర్‌సీపీ వార్డు ప్రెసిడెంట్‌ సురాడ తాతారావు,  ఫిషర్‌మెన్‌ కమ్యూనిటీ నేత కదిరి అప్పారావు, వైజాగ్‌ జనరల్‌ కార్గో బెర్త్‌ (వీజీసీబీ) సీఈఓ శ్రీ  సీ సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.


వేదాంతకు చెందిన వీజీసీబీ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా ప్రస్తుత బ్యాచ్‌లోని  500మందికి పైగా బాలికలు ప్రయోజనం పొందనున్నారు. అలాగే ఈ పాఠశాలలో భావి బ్యాచ్‌లు సైతం ప్రయోజనం పొందనున్నాయి. ఈ వినూత్నమైన కార్యక్రమాలను విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు ప్రశంసించారు. వేదాంత ఐరన్‌ అండ్‌ స్టీల్‌ సెక్టార్‌ సీఈఓ సౌవిక్‌ మజుందార్‌ మాట్లాడుతూ.. ఈ వినూత్నమైన సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల పట్ల వీజీసీబీ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా పాఠశాల మౌలిక వసతులను వారు మెరుగుపరచడంతో పాటుగా అత్యుత్తమ విద్యా సదుపాయాలకు భరోసా కల్పించారని ప్రశంసించారు. చైతన్య స్రవంతి ఫౌండింగ్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ షిరిన్‌ రెహమాన్‌ మాట్లాడుతూ..‘ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను వీజీసీబీ నిర్వహిస్తోందన్నారు. పాఠశాలకు కంప్యూటర్‌ ల్యాబ్‌, సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌తో మద్దతునందిస్తున్నారని, వీజీసీబీ చేపట్టిన ఆలోచనాత్మక కార్యక్రమాలు  ప్రశంసనీయమని అన్నారు. 

Updated Date - 2022-08-03T03:09:51+05:30 IST