పశు బీమా.. అందేది ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-07-04T07:04:46+05:30 IST

రైతు సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ప్రకటనలు చేస్తున్నారు తప్పితే అసలు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో పశుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.

పశు బీమా.. అందేది ఎప్పుడు?

  • రెండేళ్లుగా అందని బీమా
  • జిల్లాలో రూ.6కోట్ల బకాయిలు
  • ఆందోళనలో పాడి రైతులు

కోటనందూరు, జూలై 3: రైతు సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ప్రకటనలు చేస్తున్నారు తప్పితే అసలు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో పశుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని మొదటి ఏడాది ఆర్భాటంగా చేశారు. తర్వాత నుంచి పశుబీమాపై ఆలనా, పాలనా మర్చిపోయారు. రైతు సంక్షేమం కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్నామని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ 2020, మే నుంచి పథకానికి సంబంధించి బీమా సొమ్ము విడుదల చేయలేదు.

బీమా అందక..

జిల్లాలో అనేక మంది పాడి రైతు లు బీమా అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ అనుబంధ రం గాల్లో పాడి పరిశ్రమ అతి ప్రధానమైంది. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలను పెంచు తూ చాలామంది పశుపోషకులు జీవనోపాధి పొందుతున్నారు. గేదెలు, ఆవులు, గొర్రె లు, రొమ్మురోగం, గాలికుంటవ్యాధి, కాలికుంటవ్యాధి తదితర జబ్బులు బారిన పడు తున్నాయి. ప్రాణాంతక వ్యాధులతో తరుచూ కొన్ని మూగజీవులు మృతి చెందు తు న్నాయి. రోడ్డుప్రమాదాలు, విద్యుదాఘాతంతో, ఇతర ప్రమాదాలతో మరికొన్ని మృతి చెందుతున్నాయి. జిల్లాలో 2020, మే నుంచి ఇప్పటివరకు 1500 ఆవులు, గేదెలు మృతి చెందాయి. 800 గొర్రెలు, మేకలు ప్రాణాలు కోల్పోయాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.6కోట్ల  మేర రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది.

పథకం అమలు ఇలా..

పశుపోషకులను ఆదుకునేందుకు 2019లో వైఎస్సార్‌ పశుబీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మూడు నెలలు దాటిన ప్రతి పశువుకు 12 సంఖ్యల ఇనఫ్‌ట్యాగ్‌ వేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పశుబీమా ఏర్పాటు చేసిన ట్యాగ్‌ కోసం రైతులు ఎటువంటి సొమ్ములు చెల్లించాల్సిన అవసరం లేదు. పశువులు, గొర్రెలు, మేకలు కనీసం ఒక ఈత ఈని ఉంటే పరిహారానికి అర్హత ఉంటుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు పాడి రైతు సచివాలయంలో ఉన్న పశువైద్య సహాయకులకు సమాచారం ఇవ్వాలి. ఆకస్మికంగా ఏదైనా రోగంతో పశువు మరణిస్తే ఆ కళేబరాన్ని పశువైద్యాధికారి పరిశీలించి పరిహారం కోసం నివేదిక పంపుతారు. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తారు. ఇందులో దేశవాళి(నాటు)ఆవు, గేదె మరణిస్తే రూ.15వేలు, మేలు జాతిఆవు, గేదె మరణిస్తే రూ.30వేలు ఇస్తారు. గొర్రెలు, మేకలు రూ.6వేల చొప్పన చెల్లిస్తారు. ఈ పథకం మొదటి ఏడాది బావున్నా, రెండేళ్లనుంచి ఈ పరిహారం అసలు ఇవ్వలేదు. అధికారులు స్పందించి పరిహారం మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

బిల్లులు పంపించాం

అనారోగ్యం, వివిధ కారణాలతో మృతిచెందిన పశువు లకు సంబంధించి బకాయిలు రూ.6కోట్లు చెల్లించాల్సి ఉంది. పదిరోజల కిందట రూ.81లక్షలు మంజూరయ్యాయి. మిగతావి త్వరలో వస్తాయి. నిధులు విడుదల అయిన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.

-ఎస్‌.సూర్యప్రకాశ్‌రావు, జేడీ, పశుసంవర్ధకశాఖ, కాకినాడ

Updated Date - 2022-07-04T07:04:46+05:30 IST