ధోనీ స్నేహితుడే కాదు.. మార్గదర్శకుడు కూడా..: రైనా

ABN , First Publish Date - 2020-08-03T00:08:32+05:30 IST

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఓ వీడియోను విడుదల చేసింది. ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్ ఖాతాలో...

ధోనీ స్నేహితుడే కాదు.. మార్గదర్శకుడు కూడా..: రైనా

న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఓ వీడియోను విడుదల చేసింది. ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చెన్నై కెప్టెన్ ధోనీతో పాటు రైనా కూడా ఉన్నాడు. ఈ వీడియోకు "ఎల్లప్పుడూ జట్టు కోసం పోరాడే F.R.7.3.N.D.S" అంటూ కాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోపై స్పందించిన రైనా.. ధోనీ తనకు స్నేహితుడు మాత్రమే కాదని, అతడు తనను నడిపించే మార్గదర్శకుడు కూడా అని పేర్కొన్నాడు. ‘ఫ్రాంచైజీకి థాంక్స్.. ఇంత మంచి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశారు. నాకు ధోనీ భాయ్ స్నేహితుడు మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ. నన్ను సరైన మార్గం వైపు నడిపించే శక్తి. నా మెంటార్. ఇంకా చెప్పాలంటే.. కష్టంలో ఎల్లప్పుడూ నాతోనే ఉండే వ్యక్తి. మహి భాయ్ నీకు కూడా థాంక్స్.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. త్వరలో కలుద్దాం’ అంటూ రైనా భావోద్వేగమైన రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్ కూడా స్నేహితులతో కలిసిఉన్నప్పటి ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు. 



Updated Date - 2020-08-03T00:08:32+05:30 IST